top of page

Siddha Mangala Stotram సిద్ధ మంగళ స్తోత్రం



శ్రీమదనంత శ్రీవిభూషిత అప్పలలక్ష్మీ నరసింహరాజా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ || 1 ||


శ్రీవిద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ || 2 ||


మాతా సుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాదా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ || 3 ||


సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ || 4


సవితృకాఠకచయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ || 5 ||


దోచౌపాతీ దేవ్ లక్ష్మీ ఘన సంఖ్యా బోధిత శ్రీచరణా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ || 6 ||


పుణ్యరూపిణీ రాజమాంబసుత గర్భపుణ్యఫల సంజాతా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ || 7 ||


సుమతీ నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాదా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ || 8 ||


పీఠికాపుర నిత్య విహారా మధుమతి దత్తా మంగళరూపా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ || 9 ||


ఇతి శ్రీ సిద్ధ మంగళ స్తోత్రం సంపూర్ణం |

ఫల శృతి:-

నాయనలారా పరమ పవిత్రమైన ఈ సిద్ధమంగళ స్తోత్రం పఠించిన ఎడల అనఘాష్టమి వ్రతం చేసి సహస్ర సద్భ్రామణ్యమునకు భోజనము పెట్టిన ఫలము లభించును. మండల దీక్ష వహించి ఏకభుక్తము చేయుచు కాయ కష్టంతో అర్జించిన ద్రవ్యమును వినియోగించి సహస్ర సద్భామన్యమునకు భోజనము పెట్టిన ఫలము లభించును. ఈ స్తోత్రము యోగ్యులు చే పటింపబడును దీనిని పటించుటవలన సిద్ధపురుషుల దర్శన స్పర్శనలు కలుగును మనసును తలచిన కోరికలు నెరవేరును మనసా వాచా కర్మణా దత్తారాధన చేసిన భక్తులు ఈ స్తోత్రము పటించినంతనే శ్రీపాదుల వారి కృపకు పాత్రులు అగుదురు. ఈ స్తోత్రము పటించినచోట సూక్ష్మవాయుమండలంనందలి సిద్ధులు అదృశ్యరూపమున సంచరించిచుందురు.

1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
smathrugami2498
Dec 18, 2023

Sripada rajam saranam prapadye

Like
WhatsApp

©  2023. స్మాతృగామి పబ్లికేషన్స్. సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి

  • Whatsapp
  • Youtube
  • YouTube
  • Facebook
  • Instagram
bottom of page